ధర్మ పరిరక్షణ.. ప్రజా క్షేమం.. సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ .. మంగళగిరి జనసేన కార్యాలయంలో యాగం చేపట్టారు. ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ చేశారు. ఉదయం 6 గంటల 55 నిమిషాలకు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలతో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు పవన్ కల్యాణ్. యాగశాలలో అయిదుగురు దేవతామూర్తులను ప్రతిష్టాపించారు. ఐదు దేవతా మూర్తులకు అభిముఖంగా యంత్ర స్థాపన చేపట్టారు. విగ్రహం.. యంత్రం.. హోమం ఆలంబనగా ఉదయం ప్రారంభమైన యాగం రేపు కూడా కొనసాగుతుంది.
విజయవాడ దుర్గగుడిలో వారాహి పొలిటికల్ యాత్ర సక్సెస్ కావాలంటూ జనసేన నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లుండి నుంచి ప్రారంభంకానున్న పవన్ వారాహి యాత్ర ఎలాంటి ఆటంకాల్లేకుండా కొనసాగాలని 108 కొబ్బరికాయలు కొట్టారు.