AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎన్‌సిపి వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా సుప్రియ, ప్రఫుల్ పటేల్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్‌ శరద్‌ పవార్‌ తన కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, పార్టీ ఉపాధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌ను ఎన్సీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ప్రకటించారు. 1999లో పీఏ సంగ్మాతో కలిసి ఎన్సీపీని ఏర్పాటు చేసిన శరద్‌ పవార్‌, ఆ పార్టీ 25వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. గతంలో పార్టీలో తిరుగుబాటుకు ప్రయత్నించిన మేనల్లుడు, ఎన్సీపీ కీలక నేత అజిత్‌ పవార్‌ సమక్షంలోనే శరద్‌ పవార్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా, శరద్‌ పవార్‌ గత నెలలో ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. శరద్‌ పవార్‌ రాజీనామాను తిరస్కరించి, ఆయననే అధ్యక్షుడిగా కొనసాగాలని సూచించింది. దీంతో పవార్‌ తన మనసు మార్చుకున్నారు. అయితే ఇది పార్టీ వారసుల అంశంపై చర్చకు దారి తీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌ను శరద్‌ పవార్‌ నేడు ప్రకటించారు.

ANN TOP 10