పూజారి చేతిలో దారుణంగా హత్యకు గురైన అప్సర మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం చేశారు. కాసేపటి క్రితమే ఉస్మానియా ఆస్పత్రిలో అప్సర మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయ్యింది. ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యులు యాదయ్య & అతని బృందం ఈ పోస్టుమార్టంను నిర్వహించారు. పోస్ట్‌మార్టం అనంతరం అప్సర మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈరోజు సరూర్‌నగర్‌లోనే అప్సర అంత్యక్రియలను తల్లిదండ్రులు నిర్వహించారు.









