AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మద్యం మత్తులో ఏడో అంతస్తు నుంచి పడి యువతి మృతి

స్నేహితులతో కలసి మద్యం పార్టీలో పాల్గొన్న ఒక యువతి ఏడవ అంతస్తు నుంచి కింద పడి మరణించింది. మహారాష్ట్రలోని నవీ ముంబైలో గురువారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.

స్నేహితులతో కలసి నిర్మాణంలో ఉన్న ఒక నిర్జన భవనంలో మద్యం పార్టీ చేసుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. బేలాపూర్‌లోని ఎన్‌ఆర్‌ఐ పోలీసులు మృతురాలి స్నేహితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

నిర్మాణం పూర్తికాని ఆ నిర్జన భవనంలోని ఏడవ అంతస్తులో తన స్నేహితులు కొందరితో కలసి ఆ యువతి మద్యం పార్టీ చేసుకుంటుండగా అదుపుతప్పి భవనంపై నుంచి కింద పడిపోయినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ఈ వాదనలోని నిజానిజాలను నిర్ధారణ చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఆ భవనం వద్దకు చేరుకుని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భవనం వద్దకు ఎవరూ రాకుండా దిగ్బంధం చేశారు.

– Advertisement –

ANN TOP 10