తిరుపతి రెండో ఘాట్ రోడ్డులో తిరుపతి నుంచి తిరుమల వెళుతున్న ఓ టెంపో వాహనం కొండను ఢీకొట్టింది. ఓ బస్సును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. సేఫ్టీ వాల్, రెయిలింగ్ లేకపోవడంతో టెంపో నేరుగా కొండను తాకింది. ప్రమాద సమయంలో టెంపోలో డ్రైవర్ తప్ప ఎవరూ లేరు. కొండను ఢీకొట్టిన నేపథ్యంలో టెంపో ముందుభాగం ధ్వంసమైంది. వరుస ప్రమాదాలపై టీటీడీ పాలకవర్గం సమీక్ష చేపట్టి, సూచనలు చేసిన వారంలోపే ఘటన జరగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.









