AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సిద్ధిపేట సిగలో మరో మణిహారం.. ప్రారంభానికి సిద్ధమైన ఐటీ హబ్

మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే అభివృద్ధిలో ముందున్న సిద్ధిపేటలో ఐటీ హబ్‌ ప్రారంభానికి సిద్ధమైంది. నియోజకవర్గ స్థాయి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు సిద్ధిపేటలో ఐటీ హబ్ ఏర్పాటు చేసిందని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. సిద్ధిపేట శివారులో నిర్మిస్తున్న ఐటీ హబ్‌ను శుక్రవారం ఉదయం ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి మంత్రి సందర్శించారు.

అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఐటీ హబ్ భవనాన్ని ఈ నెల జూన్ 15వ తేదీన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా 750 మంది స్థానిక యువతకు, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. జూన్ 13వ తేదీన సిద్ధిపేట పోలీసు కన్వెన్షన్ హాల్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ మెగా జాబ్ మేళాలో 11 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు ఇవ్వనున్నాయని, ఈ సదవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ANN TOP 10