తెలంగాణ అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాల వల్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఎర్ర తివాచీ పరిచామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు అన్నా రు. గురువారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం ముసాబ్ పేట మండలం వేముల గ్రామంలో రూ. 500 కోట్ల పెట్టుబడులతో ఎస్‌జిడి కార్నింగ్ కంపెనీకి భూమి పూజ చేశారు. అనంతరం ఎంఎల్‌ఎ ఆల వెంకటేశ్వ ర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి కెటిఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించకముందు పరిశ్రమలు రా వాలంటే రెడ్ టేప్ ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ కార్పెట్ పరిచి పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని వ్యాఖ్యానించారు. దేశ జనాభాకు తగ్గట్టుగా ప్రభుత్వ రంగ సంస్థ్ధల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేమని, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించి ఉద్యోగాలు క ల్పించే విధంగా చూస్తున్నామని అన్నారు. వేముల దగ్గర ఏర్పాటు కానున్న కార్నింగ్ కంపెనీ ద్వారా 2000 మందికి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.
మహబూబ్‌నగర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ భవనానికి మంత్రి కెటిఆర్ భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ ఒకప్పుడు మహబూబ్‌నగర్ అంటే మైగ్రేషన్ అని.. ఇప్పుడు మహబూబ్‌నగర్ అంటే ఇరిగేషన్ అని అన్నా రు. ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారిం ది అనే వాస్తవం గుర్తించాలి. భారీ ఎత్తున ఐటి, ఫార్మా రంగాలతో 5 లక్షల మంది ఐటి ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉపాధి పొందుతున్నారన్నారు.
ఇటీవల దివిటిపల్లిలో రూ. 9500 కోట్లతో అమరరాజా కంపెనీని ఏర్పా టు చేశామని, మహబూబ్‌నగర్ ఐటి హబ్‌లో వేలా ది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్న రు. తెలంగాణ రాష్టం వ్యాక్సిన్‌కు హబ్‌గా ఉందని నూతన పారిశ్రామిక విధానంతో (టిఎస్‌ఐపాస్) 15 రోజుల్లోనే కంపెనీలకు అన్ని అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు.









