AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అబిడ్స్‌లో అగ్నిప్రమాదం

అబిడ్స్‌లో ట్రూప్‌ బజార్‌ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫీర్డౌస్ మాల్‌లోని ఎల్‌ఈడీ లైట్లు విక్రయించే షో రూమ్‌ రెండో అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో పక్కన ఉన్న వ్యాపారులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

విద్యుత్ ఘాతంతోనే మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన షో రూమ్‌ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. పైన అంతస్థులో ఓ మహిళా చిక్కుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది, స్థానిక సుల్తాన్ బజార్ పోలీసులు ఆమెను సురక్షితంగా బయటకు తీసుకవచ్చారు. ప్రస్తుతానికి 3 ఫైరింజన్లతో సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.

ANN TOP 10