జడ్చర్లలో నేడు కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా సుఖ్విందర్ సింగ్ హాజరుకానున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, వర్కింగ్ ప్రసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, వంశీ చంద్ రెడ్డి, జాతీయ నాయకులు కొప్పుల రాజు, హర్కర వేణుగోపాల్ తదితరులు సుఖ్విందర్ సింగ్ కు స్వాగతం పలికారు. సాయంత్రం సభ ప్రారంభం కానుంది.