కేరళలోని కన్నూర్‌లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంట్లో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మృతదేహాలన్నీ ఇంట్లోని ఉరిలో వేలాడుతూ కనిపించాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. ముగ్గురు చిన్నారుల మృతదేహాల్లో రసాయనాలు లభ్యమయ్యాయి. ప్రాథమిక విచారణలో పిల్లలు నిద్రమాత్రలు వేసుకుని చనిపోయారని తేలింది. అయితే శరీరంలో దొరికిన పదార్థం విషపూరితమైనదా కాదా అని తెలుసుకోవడానికి అంతర్గత అవయవాలను పరీక్షించాలని నిర్ణయించారు. మృతులను షాజీ (42), భార్య శ్రీజ (38), శ్రీజ పిల్లలు సూరజ్ (12), సుజిన్ (8), సుర్భి (6)గా గుర్తించారు. షాజీ, శ్రీజ గదిలో వేలాడుతుండగా.. మెట్లపై పిల్లల మృతదేహాలు కనిపించాయి. షాజీ, శ్రీజ ఒకే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు.