మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో చిరుత సంచారం అంటూ స్థానికంగా ఓ వీడియో వైరల్ అయింది. అపురూప కాలనీలో చిరుత సంచిరిస్తున్నట్లు.., అందుకు సంబంధించిన దృష్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లుగా ఓ వీడియో క్లిప్ స్థానిక వాట్సా్ప్ గ్రూప్‌ల్లో వైరల్ అయింది. అర్ధరాత్రి సమయంలో చిరుత కాలనీలో దర్జగా తిరుగుతున్న దృశ్యాలు అందులో కనిపించాయి. చిరుత సంచారం అంటూ వీడియో బయటకు రావటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మెున్న బోరంపేట, నేడు అపురూప కాలనీలో చిరుత ఆనవాళ్లు కనిపించటంతో హడలెత్తిపోయారు. ఏ సమయంలో ఎటువైపు నుంచి చిరుత దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడిపారు. రాత్రి సమయాల్లో బయటికి వెళ్ళేందుకు జంకుతున్నారు. చిరుత సంచారం విషయం తెలుసుకున్న అటవీ అధికారులు.. కాలనీని సందర్శించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించారు. అయితే కాలనీలో చిరుత సంచారం లేదని తేల్చిచెప్పారు. కాలనీలో సంచరిచింది అడవి కుక్క అని.. అది చిరుతపులి కాదని నిర్ధారించారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదని ధైర్యం చెప్పారు. ఎక్కడో జరిగిన కొన్ని వీడియో క్లిప్‌లు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయని అన్నారు. అలాంటి వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.









