AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సూర్యాపేటలో ఎలుగుబంటి కలకలం

అది ఓ టౌన్ ఏరియా. సమయం అర్థరాత్రి. ఓ నిర్మాణ దశలో ఉన్న భవనం ముందుకు వచ్చి పదుల సంఖ్యలో కుక్కలు మొరుగుతున్నాయి. ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. ఆ ఇంటి యజమాని అనుమానస్పదంగా లోపలికి వెళ్లి చూడగా.. అనుకోని అతిథి కనిపించింది. అదేంటో కాదండోయ్ ఎలుగుబంటి. అవును ఓ ఎలుగుబంటి సూర్యాపేటలో హల్‌చల్ చేసింది. డిమార్ట్ వెనకాల నిర్మాణంలో ఉన్న భవనంలోకి రాత్రి ప్రవేశించింది. టౌన్‌లోకి ఎలుగుబంటి ఎక్కడ నుంచి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది.. స్పాట్‌కు చేరుకుని ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సరైన సామాగ్రి లేకపోవడంతో హైదరాబాద్ నుంచే తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ANN TOP 10