కర్నాటక సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.ఈ క్రమంలోనే సీఎం ఎవరూ అనేది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం సీఎం రేసులో ఉన్న శివకుమార్ కు అధిష్టానం అవకాశమిస్తుందా? లేక సిద్ధరామయ్యను మళ్లీ ముఖ్యమంత్రి చేస్తుందా? అనేదానిపై చర్చలు కొనసాగుతున్నాయి.కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య పార్టీని ముందుండి నడిపించారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుకు ఈ ఇద్దరు ఎంతో కృషి చేశారు. కన్నడ ప్రజలను తమవైపుకు తిప్పుకుని, అధికారాన్ని చేజిక్కించుకోవడంలో ఈ ఇద్దరు నేతలు కీలకం. అయితే ఈ ఇద్దరిలో పార్టీ అధిష్టానం ఎవరిని సీఎంగా ప్రకటిస్తుందనేది ప్రశ్నాకర్థకంగా మారింది.
సిద్ధరామయ్య గతంలో ఒకసారి కర్నాటక సీఎంగా వ్యవహరించారు.దీంతో ఈ సారి ఆ అవకాశం శివకుమార్ కు ఇస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.అయితే అనుభవం కలిగిన సిద్ధరామయ్యకే ఏఐసీసీ సీఎం సీటు ఇస్తుందని అంటున్నారు. మరోవైపు ఇద్దరు పోటీపడుతుంటంతో ఒక్కొక్కరికి రెండున్నరేళ్ల పాటు బాధ్యతలు అప్పగిస్తుందని రాజకీయాల్లో చర్చ. ఇదిలా ఉండగా, ఎల్లుండి కర్నాటక సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. అదేరోజు డీకే శివకుమార్ పుట్టినరోజు. దీంతో ఏఐసీసీ శివకుమార్ కు బర్త్ గిఫ్ట్ గా ఏం ఇవ్వనుంది.? సీఎం పదవిని శివకుమార్ కు అధిష్టానం కానుకగా ఇస్తుందని కన్నడ ప్రజలు అనుకుంటున్నారు. మరీ అధిష్టానం నిర్ణయం ఏంటనేది తీవ్ర ఉత్కంఠ రేపుతుంది.









