AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో దారుణం.. జిమ్ ట్రైనర్ సజీవదహనం

కూకట్‌పల్లి ప్రసన్న నగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ మంటల్లో ఒకరు మృతి చెందారు. మృతుడు జిమ్ ట్రైనర్ జయకృష్ణగా గుర్తించారు పోలీసులు. ఐదు రోజుల క్రితమే భార్య, పిల్లలను జిమ్ ట్రైనర్ జయకృష్ణ ఊరికి పంపించినట్లు నిర్ధారించారు పోలీసులు. దీంతో ఆత్మహత్యా అన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదం సమయంలో జయకృష్ణ ఒక్కడే ఇంట్లో ఉన్నట్లు పోలీసులు తేల్చారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు చెలరేగడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ సాయంతో మంటలు ఆర్పి వేశారు. అప్పటికే జయ కృష్ణ మృతి చెందాడు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఉదయం బంధువులతో కలిసి మద్యం సేవించి.. వారంతా బయటకు వెళ్లిన సమయంలో బెడ్రూంలో పడుకొని పోయాడు జిమ్ ట్రైనర్ జయకృష్ణ. అదే టైంలో మంటలు ఇల్లంతా వ్యాపించాయి. బయటకు వెళ్లలేని పక్షంలో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే జయకృష్ణ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడా ? లేక అగ్నిప్రమాదమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ANN TOP 10