ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో డా.బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్య పాలనకు అడ్డుంకులు ఎదురవుతున్నాయని సీపీఐ నాయకులు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పోరేట్ సంస్థలకు బీజేపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని.. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. హిందు ఓట్లకు గాలం వేసి ఇతరులను చిన్నచూపు చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షం లేకుండా చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని..అయితే రాజ్యాంగంలో ప్రతిపక్షాలకు, అధికారపక్షాలకు సమన్యాయం ఉంటుందని తెలిపారు.ఉత్తరప్రదేశ్ లో విచ్చలవిడిగా హత్యలకు, అత్యాచారాలకు, అన్యాయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహవ వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం మతోన్మాదాలకు, మానభంగాలకు, అఘాయిత్యాలకు నిలయంగా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
