AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రూ.40 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ.1 ఖర్చుతో 5 కి.మి వెళ్లొచ్చు!

మీరు అందుబాటు ధరలో అదిరే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకుంటే తక్కువ ధరలోనే కళ్లుచెదిరే ఎలక్ట్రిక్ స్కూటర్ (EV) లభిస్తోంది. దీని రేంజ్ ఎక్కువ. ఇంకా రన్నింగ్ కాస్ట్ కూడా తక్కువ. అందువల్ల తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ డీల్‌ను ఒకసారి పరిశీలించొచ్చు. ఇంతకీ ఇది ఏ స్కూటర్ (Scooter) అని అనుకుంటున్నారా? అక్కడిక వస్తున్నాను.

గ్రెటా ఎలక్ట్రిక్ కంపెనీ మార్కెట్‌లో పలు రకాల మోడళ్లను విక్రయిస్తోంది. వీటిల్ల్ హార్పర్ జెడ్‌ఎక్స్ మోడల్ కూడా ఒకటి. ఇందులో సూపర్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 41,999గా ఉంది. ఇందులో ఫిక్స్‌డ్ రివర్స్ స్పీడ్, లార్జ్ బూట్ స్పేస్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. బ్యాటరీ ఫుల్ కావడానికి 2.5 గంటలు పడుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు వెళ్లొచ్చు. బ్యాటరీపై మూడేళ్ల వరకు వారంటీ లభిస్తుంది.

అలాగే కిలోమీటరుకు రూ.0.20 ఖర్చు వస్తుందని కంపెనీ పేర్కొంటోంది. అంటే స్కూటర్ రన్నింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అనే చెప్పుకోవచ్చు. ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉంయి. ఎకో, సిటీ, టర్బో అనేవి ఇవి. చైల్డ్ లాక్ ఫీచర్ ఉంది. ఫ్రంట్ వీల్ లాక్, మొబైల్ చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ సకూట్ వైట్, బ్లాక్, బ్లూ సహా పలు రకాల కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.

ANN TOP 10