AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కర్నాటక క్యాంపయిన్ లో కమెడియన్ బ్రహ్మానందం

కర్ణాటక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పార్టీలు పోటాపోటీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. తాజాగా సినిమా ప్రముఖులు సైతం ఎన్నికల ప్రచారంలో చేరారు. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగు వారు ఎక్కువగా ఉండే చిక్ బళ్లాపూర్ లో బీజేపీ తరుపున ఆయన ప్రచారం చేశారు.చిక్ బళ్లాపూర్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత డా. సుధాకర్ కు ఓటేయాలని కన్నడ ప్రజలను కోరారు. బ్రహ్మానందం రాకతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. అక్కడి జనం పోటాపోటీగా ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు.

ANN TOP 10