AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏ ఫ్లోర్‌లో ఎవరెవరు?.. వివరాలివిగో..

తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభమైంది. నూతన ఫైళ్లపై సంతకాలు చేసిన అనంతరం మంత్రులకు ఛాంబర్​ లు కేటాయించారు. మంత్రి హరీష్​ రావు తన ఛాంబర్​ లో ప్రత్యేక పూజలు చేసి ఫైలుపై సంతకం చేశారు. అంతకు ముందు హరీష్​ రావు సీఎం కేసీఆర్​ నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలాగే పలువురు మంత్రులు వారికి కేటాయించిన ఛాంబర్​ లలో ఆశీసులైనారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ( సీఎస్​) శాంత కుమారి కూడా తన ఛాంబర్​ లో ఆసీనులయ్యారు. కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం ప్రారంభించారు. ఆ తర్వాత మంత్రులు, అధికారులు ఒకేసారి తమ సీట్లలో ఆసీనులయ్యారు. కాకతీయ శైలి, హిందూ, దక్కనీ శైలుల మేళవింపుతో రూపుద్దిద్దుకుని కేక పుట్టించేలా ఉన్న ఈ సచివాలయంలో ఏ ఫోర్‌లో ఏ శాఖా మంత్రులు ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్లోర్ల వారీగా మంత్రులు..
గ్రౌండ్‌ ఫ్లోర్‌: కొప్పుల ఈశ్వర్‌ (A వింగ్‌), మల్లారెడ్డి (B వింగ్‌)
ఫస్ట్ ఫ్లోర్‌: మహమూద్‌ అలీ (A వింగ్‌), సబితా ఇంద్రారెడ్డి (B వింగ్‌), ఎర్రబెల్లి (D వింగ్‌)
సెకండ్ ఫ్లోర్‌: హరీష్‌రావు (A వింగ్‌), జగదీష్‌ రెడ్డి (B వింగ్‌), తలసాని శ్రీనివాస్‌ (D వింగ్‌)
థర్డ్ ఫ్లోర్‌: కేటీఆర్‌ (A వింగ్‌), సత్యవతి రాథోడ్‌ (B వింగ్‌), నిరంజన్ రెడ్డి (D వింగ్‌)
ఫోర్త్ ఫ్లోర్‌: ఇంద్రకరణ్ రెడ్డి (A వింగ్‌), శ్రీనివాస్‌ గౌడ్‌ (B వింగ్‌), గంగుల కమలాకర్ (D వింగ్‌)
ఫిఫ్త్ ఫ్లోర్: ప్రశాంత్ రెడ్డి (A వింగ్‌), పువ్వాడ అజయ్‌ (D వింగ్‌)
సిక్స్త్ ఫ్లోర్‌: సీఎం కేసీఆర్‌, సీఎంఓ

అంతస్తుల వారీగా శాఖల వివరాలు..
గ్రౌండ్‌ ఫ్లోర్‌: ఎస్సీ సంక్షేమ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, రెవెన్యూ, కార్మిక, ఉపాధి కల్పన శాఖలు
మొదటి అంతస్తు: హోం, గ్రామీణాభివృద్ది, విద్యా, పంచాయతీరాజ్‌ శాఖలు
2వ అంతస్తు: వైద్యారోగ్యం, విద్యుత్‌, సెకండ్ ఫ్లోర్‌, పశు సంవర్ధక, ఆర్థిక శాఖలు
3వ అంతస్తు: మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, పురపాలక, పట్టణాభివృద్ది, ప్లానింగ్‌, ఐటీ, వ్యవసాయ, సహకార, పరిశ్రమలు, వాణిజ్య శాఖలు
4వ అంతస్తు: పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, యువజన, పర్యాటక, బీసీ సంక్షేమ, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక, నీటి పారుదల, న్యాయశాఖలు.
5వ అంతస్తు: రవాణా, రహదారులు, సాధారణ పరిపాలన, భవనాల శాఖలు.
6వ అంతస్తు: సీఎం కార్యాలయం, సీఎం పేషీ, కార్యదర్శులు

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10