AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యువతిలా ఎమ్మెల్యేతో చాట్ చేశాడు.. ఆ తర్వాత..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను ఓ వ్యక్తి నగదు కోసం బెదిరించిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అజమాబాద్‌కు చెందిన ఎండీ ఇషక్ అనే వ్యక్తి ఈ నెల 23 న బెల్లంపల్లి ఎమ్మెల్యేకు సాధారణ, వాట్సప్ సందేశాలు పంపించాడు. అదికూడా ఓ యువతిలా చాటింగ్ చేశాడు. తనకు 90 వేల రూపాయలు ఇవ్వాలంటూ బెదిరించాడు.

ఇటీవల ఆ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు, ఆరిజిన్ డెయిరీ యాజమాన్యానికి గోడవలు జరిగాయి. అయితే వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయంటూ ఇషక్ బెదిరించాడు. చివరి ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు మమోదు చేసుకున్న పోలీసులు యువతిలా చాట్ చేసిన వ్యక్తిని ఇషక్‌గా గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

ANN TOP 10