AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సూర్య పొలిటికల్‌ ఎంట్రీ..? సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్..

తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడంతో మరో హీరో సూర్య రాజకీయ ప్రవేశంపై చర్చ మొదలైంది. ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తారా? విజయ్ బాటలో నడుస్తారా? అంటూ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ ప్రశ్నలకు సూర్య స్వయంగా సమాధానమిచ్చారు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

చెన్నైలో జరిగిన తన తాజా చిత్రం ‘సీన్’ విజయోత్సవ కార్యక్రమంలో సూర్య ఈ విషయంపై మాట్లాడారు. రాజకీయాల్లోకి రావడం లేదని చెబుతూనే.. రాజకీయాలంటే తనకు ద్వేషం లేదని పేర్కొన్నారు. రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నానని చెప్పారు. ఆ రంగంపై పూర్తిస్థాయి అవగాహన, బాధ్యతల గురించి తెలుసుకోకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టబోనని స్పష్టం చేశారు.

సూర్య రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు సాయం చేస్తున్న ఆయన ‘అగరం ఫౌండేషన్’ సేవా కార్యక్రమాలు ఈ చర్చకు కారణమయ్యాయి.

సూర్య నటించిన ‘సీన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. జీతు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ చిత్రంలో నజ్రియా నజీమ్, మలయాళ నటుడు నస్లెన్ కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 6న విడుదలైన ఈ సినిమా తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది. భారత్‌లో నెట్ వసూళ్లు రూ.62.75 కోట్లకు చేరినట్లు పేర్కొంది.

ANN TOP 10