AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్‌రెడ్డి లాంటి సీఎం ఉండడం మన ఖర్మ..! తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..

తలసాని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్రంగా నానుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చెప్పడానికి ఈ వ్యాఖ్యలే ఉదాహరణ అని బీఆర్ఎస్ శ్రేణులు అంటుంటే, తలసాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా నెరవేర్చలేదని తలసాని ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలతో పాటు మహిళలు, రైతులకు ఇచ్చిన రకరకాల మాటలను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆరోపించారు. కేవలం కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, పాలనలో సంక్షేమం పూర్తిగా కొరవడిందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇటీవల భర్తీ చేసిన ఎమ్మెల్సీ స్థానాల విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహరించిన తీరును తలసాని తప్పుపట్టారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో చదువుకున్నవారు, అర్హత ఉన్న నాయకులు ఎవరూ లేనట్టుగా రెండు ఎమ్మెల్సీ పదవులనూ ఒకే సామాజిక వర్గానికి (రెడ్డి) కేటాయించడం ఏమాత్రం తగదన్నారు. బహుజన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తలసాని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల తరఫున పోరాడేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు.

ANN TOP 10