తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 4న అమిత్ షా పర్యటటించనున్నారు. దీనికోసం ఒక్కరోజు ముందే హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. అక్టోబర్ 3వ తేదీ రాత్రి 9:10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు అమిత్ షా రానున్నారు. హోటల్ కాకతీయలో రాత్రి బస చేయనున్న అమిత్ షా. అక్టోబర్ 4, ఆదివారం రోజు ఉదయం బేగంపేట నుంచి (మెదక్) తూప్రాన్‌కు హెలికాప్టర్‌లో ప్రయానించి, మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్‌కు అమిత్ షా సబర్ డెయిరీ మిల్క్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. అనంతరం తూప్రాన్‌లోనే భోజనం చేయనున్న కేంద్ర హోంమంత్రి షెడ్యుల్ కారారు చేయనున్నారు. తూప్రాన్ నుంచి హెలికాప్టర్‌లో కరీంనగర్‌కు అమిత్ షా వెల్లనున్నారు. కరీంనగర్‌లో ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో అమిత్ షా పాల్గొననున్నారు.
అనంతరం మధ్యాహ్నం 2:40 నుంచి సాయంత్రం 4:10 వరకు సిల్వర్ జూబ్లీ కార్యక్రమం జరగనుంది. కరీంనగర్ నుంచి హెలికాప్టర్‌లో బేగంపేటకు తిరుగు ప్రయాణం చేయనున్నట్టు అధికారులు తెలిపారు. సాయంత్రం 5:15 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి అమిత్ షా బయలుదేరనున్నాడు.








