AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..!

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఈ విషయం తెలియగానే ఆయనపై సామాజిక సంక్షేమ బోర్డు ఛైర్మన బాలకోటయ్య పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయనపై చర్యలు తప్పవనే వాదన బలంగా వినిపిస్తోంది. అసలు ఏం జరిగింది?

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గురించి చెప్పనక్కర్లేదు. వివాదాలకు ఆయన్ని కేరాఫ్‌గా చెబుతారు. అంశం ఏదైనా నిత్యం వార్తల్లో ఉండేందుకు రెడీగా ఉంటారు. తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు సదరు ఎమ్మెల్యే. ఓ టీచర్‌ను ఇంటికి పిలిపించి దుర్భాషలాడటమే కాకుండా ఆయన దాడి చేశారని పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు అందింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ బాలకోటయ్య, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు.

జరిగిన ఘటనపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వాదన మరోలా ఉంది. ఆటల పోటీల పేరుతో టీచర్లు-తల్లిదండ్రులు లేకుండా విద్యార్థినులను వేరేవారితో ఇతర ప్రాంతాలకు టీచర్ రమేష్ పంపించారట. ఆ పాఠశాలలో గతేడాది పదో తరగతి ఫలితాల్లో 22 మందికి 11 మంది ఫెయిలయ్యారని, ఆటల పేరుతో విద్యార్థులను ఇబ్బంది పెట్టడం వల్లే వారంతా ఫెయిలైయ్యారని ఆయన బావన. పాఠశాలలో జరుగుతున్న అంశాలంపైఅంశాలపై చర్చించేందుకు డిప్యూటీ డీఈవో, ఎంఈవో, హెచ్‌ఎం, టీచర్ రమేష్‌లను తన ఇంటికి పిలిచానని అంటున్నారు.

దీనిపై బాధిత టీచర్లు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. బాధితులు వారే కావడంతో, వారి నుంచి వచ్చే సమాధానం ఆధారంగా పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశముందని ఆ జిల్లా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. వివాదాలు ఎమ్మెల్యే కొలికిపూడికి కొత్తేమీకాదు. గతంలో విజయవాడ ఎంపీ చిన్నపై కూడా రకరకాల ఆరోపణలు చేశారు. అప్పుడు ఆ వ్యవహారం టీడీపీలో పెద్ద రచ్చ అయ్యింది. చివరకు అధినేత చంద్రబాబు జోక్యం ఆ వివాదం కాస్త సద్దు మణిగింది. ఈ క్రమంలో మరొక వివాదంలోకి ఇరుక్కున్నారు ఎమ్మెల్యే కొలికిపూడి.

ANN TOP 10