AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..! ఏపీలో మతమార్పిడిలు నిజమే..! కాంగ్రెస్‌తో ఎన్నికలకు జగన్..

సీనియర్ రాజకీయ నేత విజయసాయిరెడ్డి ఈసారి కొత్త విషయాలు బయటపెట్టారు. ఇండి కూటమితో వైసీపీ పొత్తులు పెట్టుకునేందుకు రెడీ ఉందని బాంబు పేల్చారు. ఎన్డీఏ వైపు టీడీపీ వెళ్తుందని తేల్చేశారు. పొత్తులు పెట్టుకునేందుకు ఈ రెండు పార్టీలు రెడీగా ఉన్నాయని మనసులోని మాట బయపెట్టారు.

సీనియర్ రాజకీయ నేత విజయసాయిరెడ్డి ముచ్చటగా మూడోసారి మీడియా ముందుకొచ్చారు. త్వరలో తన పార్టీ పేరు ప్రకటిస్తానని వెల్లడించారు. ఆ తర్వాత పాదయాత్ర పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో మద్యం కుంభకోణంలో తన పాత్ర లేదని మనసులోని మాట బయపెట్టారు. కర్త, కర్మ, క్రియ అంతా రాజ్‌ కెసిరెడ్డేనని తేల్చేశారు. జగన్‌పై విజయసాయి‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను వాడుకొని వదిలేశారని వ్యాఖ్యానించారు.

అధికారం వచ్చే వరకు తనను వాడుకున్నారని, అధికారంలోకి వచ్చాక కరివేపాకులా బయటకు నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019-2024 వరకు ఢిల్లీ వ్యవహారాలను తాను పూర్తిగా చూశానని తెలిపారు. సీఎంవోలో జరిగిన విషయాలతో నాకు సంబంధం లేదని, అక్కడ తాను చక్రం తిప్పానన్న మాటలు అవాస్తమన్నారు. ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉంటే ఒకటి తొలగించాలన్నారు విజయసాయిరెడ్డి. అక్రమంగా ఇక్కడికి వచ్చి ఉంటున్నవారి ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై రాద్ధాంతం చేయడం, వైసీపీ మద్దతివ్వడం అవివేకమన్నారు

అదే సమయంలో వైసీపీ నేతలకు విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్న నేతల చిట్టా బయట పెడతానని హెచ్చరిక చేశారు. మత మార్పుడిలపైనా మరోసారి మాట్లాడారు వీఎస్ఆర్. 2019-2024 మధ్య ఏపీలో మతమార్పిడిలు అంటే 1.3 నుంచి 5.7 శాతానికి చేరిందన్నారు. దీనికి సంబంధించి వివరాలు సెంట్రల్ గవర్నమెంట్ వైబ్‌సైట్‌లో చూస్తే తెలుస్తుందన్నారు. పార్టీ పెట్టిన తర్వాత మార్పిడుల వ్యవహారం ఏయే ప్రాంతాలపై ప్రభావం చూపుతుందో చెబుతానని అన్నారు.

సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల వైసీపీకి నష్టం జరుగుతోందని కుండబద్దలు కొట్టేశారు. జగన్‌ వద్ద నన్ను దుర్మార్గుడిగా చిత్రీకరించిన వ్యక్తి ఆయనేనని అసలు విషయం బయటపెట్టారు. రాజధాని అమరావతికి తాను వ్యతిరేకం కాదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పి వైసీపీ, ఇవాళ మాట మార్చిందని విరుచుకుపడ్డారు. విశాఖ రాజధాని అని చెప్పినవాళ్లు ఇప్పుడు మావిగన్‌ అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మావిగన్ లేదు మాయదారి లేదని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పిన వైసీపీ నేతలు, ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.

ANN TOP 10