AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉన్మాదుల్లా ప్రవర్తించారు.. BRSపై రేవంత్ రెడ్డి ఫైర్..!

తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా గుర్తుచేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటం నుండి నేటివరకు దేశ అభివృద్ధికై కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని, అలాంటి గొప్ప చరిత్ర ఉన్న పార్టీ నాయకులని ప్రత్యర్థి పార్టీలు కించపరచడం మంచిది కాదని అన్నారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లినప్పుడు జరిగిన ఘటనను సీఎం రేవంత్ రెడ్డి సభలో తీవ్రంగా ఖండించారు. ఖర్గే వెళ్లివచ్చిన ప్రాంతాన్ని బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు ‘శుద్ధీకరణ’ పేరిట కడిగివేయడం అత్యంత విచారకరమని, ఇది ప్రజాస్వామ్యానికే పెద్ద మచ్చ అని చెప్పుకొచ్చారు.

ఒక దళిత నాయకుడిని, దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని ఈ విధంగా అవమానించడం ఎలాంటి సంస్కృతికి నిదర్శనమని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో విభేదాలు, అభిప్రాయ భేదాలు ఉండటం సహజమేనని, కానీ వ్యక్తిగతంగా కించపరిచేలా ప్రవర్తించడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీల బృందం ఇప్పటికే రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఇక రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ తీరుపై కూడా రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. ప్రజలకు సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగాలని తమ ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ముఖ్యంగా భూములకు సంబంధించిన 22ఏ అంశంపై, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం గందరగోళం సృష్టిస్తూ సభా సమయాన్ని వృథా చేస్తోందని మండిపడ్డారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పులు, చేసిన తప్పులపై అసెంబ్లీలో చర్చ జరిగితే తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోననే భయంతోనే ప్రతిపక్షం సభను అడ్డుకుంటోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజాలు ప్రజలకు తెలియకూడదనే ఉద్దేశంతోనే సభను నడవకుండా కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడాల్సిన అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొందరు సభ్యులు బాధ్యత మరచి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

తమ కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని, దాచడానికి తమ వద్ద ఏమీ లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి నిర్ణయంపై అసెంబ్లీ వేదికగా చర్చ జరిగి తీరాల్సిందేనని, ప్రజలకు నిజానిజాలు తెలియాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పారు.

తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. brs నాయకులు చేసిన ఈ చర్యపై సభ్యులు అంతా ఇప్పటికే అంత ముక్త కంఠంతో ఖండిస్తున్నారని ..అయినా brs నేతల తీరు మారడం లేదని మండిపడ్డారు.

ఈ అట్టడుగు సమాజం కు క్షమాపణ చెప్పడం వలన వారి గౌరవం పెరుగుతుందని తెలిపారు. గడ్డం ప్రసాద్ కు జరిగిన అవమానం ను చాలా సీరియస్ గా ప్రభుత్వం తీసుకుందని ,దళితులను ఉద్దేశ్య పూర్వకంగా మాట్లాడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఫాం హౌజ్ లో ఉండి కుట్రలు చేసిన వాళ్ళకు, కుట్రకు పాల్పడ్డ వారిని చట్ట పరంగా శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ,సెప్టెంబర్ 6వ తేది నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని పరిణామాల పై హైదరాబాద్ సిటీ జాయింట్ కమీషనర్ విజయ్ కుమార్ విచారణ చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి !

ANN TOP 10