AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘సీన్ ‘గా సూర్య ..?

కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సూర్య ఒకరు ఈయన పేరుకే తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా ఈయనకు విపరీతమైన ఆదరణ ఉంది. సూర్య నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదల అవుతూ ఇక్కడ ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంటున్నాయి. ఇక ఇప్పటివరకు సూర్య తన సినీ కెరియర్లో 46 సినిమాలను విజయవంతంగా విడుదల చేశారు ఇక త్వరలోనే తన 47వ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది..

సూర్య తన 47వ సినిమాని ఆవేశం సినిమా డైరెక్టర్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో సూర్య జోడిగా నజ్రియా హీరోయిన్ పాత్రలో సందడి చేయబోతున్నారు ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాతలు తాజాగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఒకగ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు వెరైటీగా “సీన్ ” అని టైటిల్ ప్రకటించారు అదేవిధంగా ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ ఆరవ తేదీ దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా ఇండియన్ మోస్ట్ అవైటెడ్ చిత్రం రామాయణం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంఘటన తెలిసి తెలిసిందే.

ఇలా సూర్య రామాయణ సినిమాతో పోటీకి సిద్ధమవుతున్నారని చెప్పాలి. ఇక ఈ సినిమాకు సూర్య వైఫ్ జ్యోతిక నిర్మాతక వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే . ఇక మలయాళ సంగీత దర్శకుడు సుశిన్ శ్యామ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే గత కొంతకాలంగా సూర్య సరైన సక్సెస్ సినిమాలు లేక ఎంతో ఇబ్బందులకు గురి అయ్యారు. కానీ ఈ ఏడాది ఈయన వరుస బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ సూపర్ సక్సెస్ అందుకుంటున్నారు. సూర్య నటించిన కరువు సినిమా మే 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా తెలుగులో వీరభద్రుడు అనే పేరిట విడుదల అయ్యి సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

ANN TOP 10