2029 ఆంద్రప్రదేశ్ సార్వత్రిక ఎలక్షన్స్ కోసం తమకి అచ్చొచ్చిన ప్రధాన ఆయుధాన్ని బయటకు తీసేందుకు రెడీ అయింది వైసార్సీపి .అవును..ఏ పాదయాత్ర అయితే తనని అధికార పీటంపై కూర్చోబెట్టిందో అదే పాదయాత్రని మరో మారు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు వైయస్ జగన్.
ఇన్ని రోజులుగా ప్రెస్ మీట్లు , పర్యటనలతో ప్రభుత్వంపై విమర్శల దాడి చేసిన జగన్ ఇపుడు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దం అవుతున్నాడు.ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ శ్రేణుల సమావేశంలో జగన్ తన పాదయాత్రపై సంచలన ప్రకటన చేశారు.
2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల నుంచి తాను రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేయబోతున్నట్టు కుండ బద్దలు కొట్టేశాడు.ఇలా జగన్ ఒక్కసారిగా పాదయాత్రపై అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ చెయడంతో వైసార్సీపి క్యాడర్ ఒక్కసారిగా ఫుల్ జోష్ లోకి వెళ్ళిపోయింది.
నిజానికి జగన్ కి పాదయాత్ర ఎలా కలిసి వచ్చిందో చెప్పక్కర్లేదు. 2018లో ‘ప్రజా సంకల్ప యాత్ర’అంటూ ఏకంగా రాష్ట్రం మొత్తం 3,800 కిలోమీటర్లు నడిచి చంద్రబాబు పాలనలోని లోపాలని ఎత్తిచూపుతూ ప్రజలందరికి దగ్గరైపోయారు.ఒకరకంగా 2019లో 151 సీట్లతో తిరుగులేని విజయాన్ని సాధించాడంటే ఈ పాదయాత్రనే ప్రధాన కారణం అని చెప్పకతప్పదు.మొత్తానికి అచ్చొచ్చిన సెంటి మెంట్ ని మరోసారి రిపీట్ చేయబోతుందన్న మాట.
అయితే కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల విషయంలో ఎండగడుతూ క్యాడర్ కి భరోసా ఇచ్చే విధంగా పాదయాత్ర చేయడం వైసార్సీపి కి కలిసివచ్చేదే.పైగా ప్రెస్ మీట్లు ,అడపా దడపా పర్యటనలు వంటివి కాకుండా ఇలా ఏకదాటిగా పాదయాత్ర చేయడం వల్ల ఆయన ఇమేజ్ మరింత పెరగడమే కాకుండా,జనాలకి దగ్గరగా ఉండొచ్చు కూడా.
అయితే ఈ పాదయాత్రతోనే జగన్ మళ్ళీ అధికారం చేజిక్కించుకుంటాడా అంటే ఇప్పుడే చెప్పలేము.ఎందుకంటే 2018 లో ప్రతిపక్ష నేత అయిన జగన్ ఒక్క అవకాశం అంటూ పాదయాత్ర చేశాడు.దాంతో అప్పటి వరకు బాబు పాలనని చూసి విసిగిపోయిన జనం ఒక్కసారి చాన్స్ ఇద్దాం అంటూ గంపగుట్టగా ఓట్లు గుద్దేసి ఏకంగా 151 సీట్లని అప్పగించేశారు.
కాని ఇప్పుడు జగన్ పాలనని, బాబు పాలనని జనం పోల్చి చూసే ఛాన్స్ పుష్కలంగా ఉంది. పైగా జగన్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగితే టీడీపి, జనసేన, బిజేపీ కలిసి కూటమిగా బరిలోకి దిగుతాయి.అంటే జగన్ కి వచ్చే ఎన్నికలు అంత ఆషామాషీ కాదు.








