AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొండా సురేఖకు బిగ్ షాక్..! మంత్రి పదవి నుంచి తప్పించాలని క్రమశిక్షణ కమిటీ నివేదిక..?

మంత్రి కొండా సురేఖ వివాదం కాంగ్రెస్ లో ఏ స్థాయిలో దుమారం రేపిందో అందరి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై విచారణ జరిపిన క్రమశిక్షణ కమిటీ.. ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ దాటితే చర్యలు తీసుకోవాల్సిందే అని తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు ఇచ్చిన రిపోర్ట్ లో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమని.. చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టమని రిపోర్ట్ లో తేల్చి చెప్పినట్లు సమాచారం. అటు చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ నుంచి తప్పించాలని సూచించింది.

టీపీసీసీ చీఫ్ కు నివేదిక సమర్పించిన అనంతరం.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి మీడియాతో మాట్లాడారు. కఠిన చర్యలు తీసుకోవాలని నివేదకలో పేర్కొన్నట్లు తెలిపారు. ‘క్రమ శిక్షణతో ఉంటేనే పార్టీలో గౌరవం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గౌరవం దెబ్బతీసేలా, భవిష్యత్ ఎన్నికల్లో ప్రభుత్వంకి నష్టం జరిగేలా ప్రవర్తన మంచిది కాదు. కొండ సురేఖ, చిన్నా రెడ్డి ఇద్దరి అంశంపై నివేదిక అందించాం. కొండా సురేఖ, చిన్నా రెడ్డి ఇచ్చిన సమాధానాలు, మీడియాలో ఏం మాట్లాడారో పరిశీలించి సమగ్ర రిపోర్ట్ ను రూపొందించాం’ అని మల్లు రవి చెప్పుకొచ్చారు

ANN TOP 10