AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రతి సోమవారం మండల స్థాయిలో ‘ప్రజావాణి’.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించింది. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు.

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, స్థానిక సమస్యలకు వేగంగా పరిష్కారం చూపించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. ప్రజలు తమ సమస్యలను నేరుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించనున్నారు.

ఈ సమావేశానికి తహసీల్దార్, MPO, MAO, MEO, PHC వైద్య అధికారి, CDPO, సంక్షేమ అధికారులు, విద్యుత్, నీటిపారుదల, ఆర్‌డబ్ల్యూఎస్, రోడ్లు-భవనాలు, అటవీ శాఖలతో పాటు దాదాపు 23 రకాల మండల స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ANN TOP 10