అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ అరియానా ట్రంప్, ముంబైలో నిర్వహించిన గణేశ్ చతుర్థి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ నివాసంలో జరిగిన ఈ ఉత్సవాలకు ఆమె హాజరై సందడి చేశారు. ముఖ్యంగా ఈ వేడుకల్లో టిఫనీ భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ కార్యక్రమం అనంతరం టిఫనీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వేడుకలకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. ఆ ఫొటోలకు ‘లవ్ ఇండియా’ అనే క్యాప్షన్‌ను జత చేయడం విశేషం. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
టిఫనీ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ రెండో భార్య మార్లా మాపుల్స్ కుమార్తె. గతంలోనూ పలువురు అంతర్జాతీయ ప్రముఖులు అంబానీ కుటుంబం నిర్వహించే వేడుకలకు హాజరైన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో టిఫనీ కూడా చేరారు.








