సినిమా ఈవెంట్లలో యాంకరింగ్ చేయడం అంత సులభమైన విషయం కాదు. స్పాంటేనిటీ, హోస్టింగ్ స్కిల్స్‌తో పాటు అందరినీ ఆకట్టుకునే ప్రెజెంటేషన్ కూడా అవసరం. ఈ లక్షణాలతో ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఈవెంట్లలో సందడి చేస్తున్న కొత్త ముఖం చర్మిల నల్లూరి. తన యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ప్రముఖ నిర్మాత కమ్ దర్శకుడు ఎం.ఎస్. రాజు వంటి వారు సైతం ఆమెను హీరోయిన్‌గా నటిస్తావా అని అడిగే స్థాయికి ఎదిగారు.
విజయవాడలో పుట్టి పెరిగిన చర్మిల నల్లూరి అక్కడే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. కేఎల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆమెకు చదువు అనంతరం ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. అయితే ఉద్యోగంలో చేరేందుకు కొంత సమయం ఉండటంతో, ఆ ఖాళీ సమయంలో విజయవాడలోని రెడ్ ఎఫ్‌ఎమ్‌లో ఆర్జేగా తన కెరీర్‌ను ప్రారంభించారు. అనుకోకుండా మొదలైన ఈ ప్రయాణమే ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది.
రెడ్ ఎఫ్‌ఎమ్‌లో ఆర్జేగా పనిచేస్తున్న సమయంలో ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ ‘చాయ్ బిస్కెట్’ నుంచి చర్మిలకు అవకాశం వచ్చింది. వారు నిర్వహించిన ఓ కొత్త యాప్ లాంచ్ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించాలని ఆమెను సంప్రదించారు. తొలిసారి మైక్ పట్టుకున్న చర్మిల తన అద్భుతమైన ప్రెజెంటేషన్, స్పాంటేనిటీతో అందరి దృష్టిని ఆకర్షించారు. అక్కడి నుంచి సినిమా ఈవెంట్లలో వరుస అవకాశాలు అందుకుంటూ, ప్రస్తుతం తెలుగు యువతలో మోస్ట్ ఫేవరెట్ హోస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.








