శాంసంగ్ తాజాగా తన కొత్త Galaxy F70 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీతో పాటు ఆకట్టుకునే డిజైన్‌ను అందించారు. ఈ ఫోన్ ప్రారంభ ధరను రూ.25,999గా కంపెనీ నిర్ణయించింది.
Galaxy F70 Pro 5G మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999 కాగా, 8GB RAM + 128GB మోడల్ ధర రూ.29,999గా ఉంది. ఇక టాప్-ఎండ్ 8GB RAM + 256GB వేరియంట్‌ను రూ.34,999కు కొనుగోలు చేయవచ్చు.
లాంచ్ ఆఫర్లలో భాగంగా బ్యాంక్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయని శాంసంగ్ తెలిపింది. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా ఫోన్‌ను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తో పాటు శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.








