AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కర్నూలు: కార్డియాలజీ యూనివర్సిటీ టాపర్ డా. పర్వేజ్ నవాజ్‌కు గోల్డ్ మెడల్

కర్నూలు: కర్నూలు మెడికల్ కాలేజీలో కార్డియాలజీ విభాగంలో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన డా. పర్వేజ్ నవాజ్‌కు డాక్టర్ రామకృష్ణారెడ్డి స్మారక అవార్డుతో పాటు గోల్డ్ మెడల్‌ను ప్రదానం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ ఈ అవార్డును అందజేశారు.

సోమవారం కర్నూలు మెడికల్ కాలేజీలోని కార్డియాలజీ సూపర్ స్పెషాలిటీ విభాగంలో డాక్టర్ రామకృష్ణారెడ్డి మెమోరియల్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ పి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పూర్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, కార్డియాలజీ విభాగం హెచ్‌ఓడీగా పనిచేసిన కీర్తిశేషులు డాక్టర్ రామకృష్ణారెడ్డి అందించిన సేవలు అభినందనీయమని అన్నారు.

వైద్య విద్య, కార్డియాలజీ రంగంలో డాక్టర్ రామకృష్ణారెడ్డి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన పేరిట అవార్డును అందజేయడం అభినందనీయమని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. యూనివర్సిటీ స్థాయిలో ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించిన డా. పర్వేజ్ నవాజ్‌ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.

ANN TOP 10