AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భోగాపురం ఎయిర్ పోర్టులో ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు..

విశాఖపట్నం సమీపంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలు ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. అంతకుముందు, ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.

 

శనివారం విశాఖపట్నం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పల్లా శ్రీనివాసరావు ఈ వివరాలను వెల్లడించారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకడంతో పాటు, భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు 2 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు

ANN TOP 10