AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు..! కాంగ్రెస్‌ మోదీ సెటైర్‌..

నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క స్థానాన్నీ గెలుచుకోలేకపోయింది. ఈ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యంగా స్పందించారు. బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు జరిగాయని గుర్తుచేస్తూ, కాంగ్రెస్‌ ఎన్ని స్థానాలు గెలిచిందో ఊహించాలంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనికి ‘మోనోకిల్‌’ ఎమోజీని జతచేశారు. 

ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 28 ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ 12 స్థానాల్లో పోటీ చేసింది. గతంలో ఆ పార్టీ గెలిచిన నాలుగు స్థానాలు కూడా ఈ ఎన్నికల్లో ఉన్నాయి. అయినా ఈసారి ఒక్క చోటా విజయం సాధించలేకపోయింది. కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు సీటు దక్కకపోవడం గట్టి ఎదురుదెబ్బగా మారింది. 

ఈ ఫలితాలను ప్రస్తావిస్తూ మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఓటింగ్‌ యంత్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్‌ గతంలో ఆరోపణలు చేసింది. బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు నిర్వహించాలని కూడా కోరింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్‌ పత్రాలతోనే జరిగాయని మోదీ గుర్తుచేశారు. అయినా కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదంటూ పరోక్షంగా ఎద్దేవా చేశారు.

ANN TOP 10