డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ కలిసి ‘పూరీ కనెక్ట్స్’మొదలెట్టిన సంగతి తెల్సిందే.ఇక ఈ బ్యానర్ నుండి వస్తున్న ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’అనే సినిమా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారంతా.అయితే రిలీజ్ సంగతి అలా ఉంచితే ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి ఒక్క పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
సాధారణంగా ఈ అఫీషియల్ ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ నుంచి సినిమాల ప్రమోషన్లు, టీజర్లు, పోస్టర్లు లేదా షూటింగ్ అప్‌డేట్లను మాత్రమే షేర్ చేస్తుంటారు.అలాంటిది సడెన్‌గా ఒక సెన్సేషన్ కామెంట్ పోస్ట్ అవడం అందరికి పెద్ద షాకే ఇచ్చింది.’ప్రతి ఒక్కడు దొంగ బట్టేరా.. మంచోడికి చోటు లేదురా’ అంటూ పూరీ కనెక్ట్స్ ఖాతాలో పోస్ట్ చేసిన లైన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘాటైన వ్యాఖ్యకు సీరియస్‌నెస్‌ను తెలియజేసే ఎమోజీలు, డిసప్పాయింట్ ని సూచించే సింబల్స్ కూడా జోడించడంతో ఈ కాంట్రవర్సీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.








