AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిర్వహించాలనుకున్న ‘ తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ’కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం జనసేన వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

 

అనుమతి నిరాకరణకు కారణాలు ఇవే..

 

ప్రస్తుతం తెలంగాణ ఆవిర్భావ వేడుకులు జరుగుతండటం, నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ సభకు పర్మిషన్ ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే, రాజకీయ ఒత్తిళ్ల వల్లే ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటోందని జనసేన నాయకులు మండిపడుతున్నారు. ఈ సభను అడ్డుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేసిన సంగతి తలిసిందే.

 

హైకోర్టు వైపు జనసేన చూపు

 

ప్రభుత్వ నిర్ణయంపై జనసేన లీగల్ టీమ్ రంగంలోకి దిగింది. సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. న్యాయస్థానంపై తమకు నమ్మకం ఉందని, సభ జరిగి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలతో గచ్చిబౌలి పరిసరాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడిక్కింది.

ANN TOP 10