AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వం మార్పు రాజకీయాలకు ఎండ్ కార్డు..!

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పులు ఖాయమా? నేషనల్ మీడియాలో సిద్ధరామయ్య తప్పుకున్నట్లు వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఢిల్లీలో మంగళవారం రోజంతా కాంగ్రెస్ పెద్దలతో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకేల మధ్య ఏం జరిగింది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

 

కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వం మార్పు రాజకీయాలకు ఎండ్ కార్డు

 

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు దాదాపు ఖాయమైంది. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నేడు గానీ.. రేపు గానీ సీఎం సిద్ధరామయ్య తప్పుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది. నాయకత్వం మార్పుపై మంగళవారం కాంగ్రెస్ హైకమాండ్.. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకేతో దాదాపు ఎనిమిది గంటలపాటు చర్చించింది.

 

సీఎం సిద్దరామయ్యకు రాజ్యసభ సీటు, ఆయన కొడుక్కి డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు సిద్దరామయ్య ససేమిరా అన్నట్టు వార్తలు లేకపోలేదు. ఏఐసీసీ కార్యాలయంలోని మంగళవారం ఉదయం 11 గంటల నుంచి విడతల వారీగా చర్చలు సాగాయి.

 

ఏడు గంటలపాటు చర్చ.. సిద్ధరామయ్య మెట్టు దిగినట్టు సమాచారం

 

అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌గాంధీ,కేసీ వేణుగోపాల్‌, సుర్జేవాలాతోపాటు సీఎం సిద్ధరామయ్య, డీకేల మధ్య దాదాపు 8 గంటలపాటు చర్చలు జరిగాయి. ఐదుగురు నేతల మధ్య సుమారు గంటపాటు చర్చలు జరిగాయి. మార్నింగ్ సెషన్‌లో నాయకత్వం మార్పుపై ఎలాంటి సంకేతాలు రాలేదు.

 

మధ్యాహ్నం తర్వాత ఏఐసీసీ భవన్‌కు చేరుకున్న రాహుల్‌గాంధీ.. సీఎం సిద్దరామయ్యతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో రాహుల్‌ చేసిన ప్రతిపాదనలను సిద్దరామయ్య తోసిపుచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. చివరకు డీకే శివకుమార్‌తో కాంగ్రెస్ పెద్దలు చర్చించారు.

 

గడిచిన మూడేళ్లుగా పార్టీ ఆదేశాలను పాటించానని, ఏ విషయంలో పరిధి దాటలేదని గుర్తు చేశారట. ఈ నేపథ్యంలో నాయకత్వం మార్పుకు దాదాపు లైన్ క్లియర్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. చర్చల తర్వాత సీఎం సిద్దరామయ్య ముభావంగా కనిపించడం అనుమానాలకు తావిచ్చింది.

 

సమావేశం తర్వాత మీడియా ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. కేవలం రాజ్యసభ, విధాన పరిషత్‌ ఎన్నికల గురించి చర్చలు జరిగాయన్నారు. నాయకత్వ మార్పుపై అలాంటిదేమీ లేదన్నారు. సీఎం సిద్దరామయ్య నేడు లేదా రేపుగానీ రాజీనామా చేస్తారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు అన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ANN TOP 10