AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రామ్-అనిల్ రావిపూడి కాంబో..?

అనిల్ రావిపూడి, రామ్ పోతినేని కాంబోలో ఒక సినిమా రాబోతుందన్న వార్త ఇపుడు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతుంది. నిజానికి దాదాపు పదేళ్ళ క్రితమే వీరిద్దరి కాంబోలో ‘రాజా ది గ్రేట్’ సినిమా రావాలి.అయితే హీరో గుడ్డి వాడు అవడంతో నాకు సరిపోదంటూ, అప్పటికే వరుసగా మాస్ జానర్ లో సినిమా చేస్తుండటంతో కొత్తగా ట్రై చేయాలని ఈ సినిమాని పక్కన పెట్టడంతో ఇదే కథతో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు మాస్ మహారాజ రవితేజ. ఒకరకంగా ఈ సినిమా విషయంలో రాంగ్ స్టెప్ వేసిన దగ్గర నుండే రామ్ కెరీర్ లో డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు.

 

బాక్సాఫీస్ వద్ద సూపర్ ప్లాప్స్

 

యస్ ..ఆ తర్వాత రామ్ చేసిన ‘శివమ్’, ‘హైపర్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ ప్లాప్స్ అయ్యాయి మరి.ఇక పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడని అనుకునేలోపే ఆ తర్వాత వచ్చిన ‘రెడ్’, ‘ది వారియర్’, ‘స్కంద’,అలాగే గతేడాది వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు రామ్ మార్కెట్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసేశాయ్. ఇలాంటి వరుస డిజాస్టర్లలో ఉన్న రామ్, ఇప్పుడు అనిల్ రావిపూడితో సినిమా అంటే అది ఏమేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

 

రొటీన్ జబర్దస్త్ మార్కు కుళ్లు కామెడీ

 

మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాల విషయానికి వస్తే ‘పటాస్’, ‘సుప్రీం’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’ వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న మాట నిజమే కానీ, ఆయన సినిమాల్లో కంటెంట్ కంటే రొటీన్ జబర్దస్త్ మార్కు కుళ్లు కామెడీ, లౌడ్నెస్ ఎక్కువగా ఉంటాయనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేష్ బాబు అంతటి స్టార్‌తో ట్రైన్ సీక్వెన్స్‌లో చేయించిన కామెడీ ఎలాంటి ట్రోల్స్ ఎదుర్కుందో చెప్పక్కర్లేదు.ఇక ‘ఎఫ్ 3’ సినిమాతో ఆ కామెడీ మరింత దిగజారిపోయింది. ‘భగవంత్ కేసరి’తో కాస్త రూట్ మార్చాలని చూసినా, అది కూడా పాత రొటీన్ ఫార్ములా అన్న ముద్రే వేసుకుంది.ఇక సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ లతో కాసుల వర్షం కురిపించినా మొనాటని ఎక్కువైపోయిందన్న టాక్ గట్టిగానే వినిపించింది

 

నెత్తిన వేసుకోవడం అంటే పెద్ద రిస్క్

 

ఇక ప్రస్తుతం హీరోగా సక్సెస్ లేక డీలా పడ్డ రామ్ పోతినేని, తన 38వ పుట్టినరోజు సందర్భంగా గత మే 15న పెద్ద షాకే ఇచ్చాడు. ఇంక మరెవరూ హిట్టు ఇవ్వరని ఫిక్స్ అయిపోయాడేమో తనే మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారుతున్నాడు. కెరీర్‌లో 23వ చిత్రంగా (RAPO 23) రాబోతున్న ఈ సినిమాకు ‘ది స్టోరీ ఆఫ్ ఏ లోన్ వోల్ఫ్’ అనే ట్యాగ్‌లైన్ పెట్టారు. ఇందులో రామ్ ‘వీర’ అనే సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ పాత్ర పోషిస్తూ ఆయనే డైరెక్ట్ చేయబోతున్నాడు.ఇక ఈ ఎక్స్పరిమెంట్ సినిమాని రామ్ సోదరుడు కృష్ణ పోతినేని ‘రాపో సినిమాటిక్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.ఏది ఏమైనా ఒక పక్క హీరోగా తేలిపోతున్నరామ్, ఇప్పుడు డైరెక్షన్ భారం కూడా నెత్తిన వేసుకోవడం అంటే పెద్ద రిస్క్ అనే చెప్పాలి.

 

మేకర్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో

 

మరో వైపు అనిల్ రావిపూడి కూడా విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ఒక రిస్కీ మల్టీస్టారర్ ని పట్టాలెక్కించాడు.పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ తో మరోసారి జత కట్టి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ 2026 జులైలో ప్రారంభించి, డిసెంబర్ నాటికి పూర్తి చేసి, 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.అయితే వెంకటేష్ ఇమేజ్‌కు, కళ్యాణ్ రామ్ మాస్ యాక్షన్‌కు అసలు సింక్ కుదురుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ రెండు క్రేజీ, రిస్కీ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే రామ్-అనిల్ రావిపూడి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. దీనిని 2027 దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఒకవేళ ఈ లోపు రామ్ సొంత డైరెక్షన్ సినిమా, అనిల్ మల్టీస్టారర్ గనుక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడితే, 2027 దసరా నాటికి ఈ కాంబినేషన్ అసలు ఉంటుందా అన్నది అనుమానమే. చూడాలి చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై మేకర్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో

ANN TOP 10