AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నవంబర్ 11 నుంచి కేటీఆర్ బస్సు యాత్ర..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్సుయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. నవంబర్ 11 నుంచి 14వ తేదీ మధ్య రెండు రోజుల పాటు కేటీఆర్ బస్సు యాత్ర చేపడతారని తెలిపారు. మేడిగడ్డ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర, గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల మీదుగా సాగుతుందని వివరించారు. ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తూ, రైతుల ఇబ్బందులను ఆధారాలతో ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు.

మరోవైపు, తెలంగాణ ఉద్యమంలో చారిత్రక ఘట్టమైన దీక్షా దివస్‌ను పురస్కరించుకుని నవంబర్ 29న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు గంగుల తెలిపారు. 2009లో కేసీఆర్‌ను అరెస్టు చేసిన అలుగునూరు లేదా నుస్తులాపూర్ ప్రాంతంలో ఈ సభను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ సభకు సుమారు 50 వేల మంది ప్రజలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

ANN TOP 10