తారక్ పుట్టిన రోజు వదిలిన డ్రాగన్ గ్లింప్స్ ఇపుడు కొత్త రికార్డ్స్ ని పుట్టిస్తుంది. యస్..మాములుగా టీజర్లు, గ్లింప్స్‌లు కేవలం ఒకట్రెండు నిమిషాలు మాత్రమే ఉంటాయి. కానీ, ప్రశాంత్ నీల్ ఏకంగా 4 నిమిషాల నిడివితో ఒక పవర్‌ఫుల్ విజువల్ ట్రీట్‌ను కట్ చేసి వదిలారు. ఈ లెంతీ వీడియో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో సరికొత్త రికార్డుల వేటను మొదలుపెట్టింది.
ఇక విడుదలైన కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 64 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలోనే సరికొత్త ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసింది. ఇప్పటివరకు ఇండియాలో ఏ చిత్ర గ్లింప్స్‌కు కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రాలేదని తెలుపుతూ మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు కూడా.ఇక తారక్ ఇందులో పలికిన “పొరపాటున కూడా నా కలలోకి రావొద్దు” అనే డైలాగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.ముఖ్యంగా బాక్సాఫీస్ దగ్గర రాబోయే సునామీకి ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని ఇప్పటి నుండే మురిసిపోతున్నారు తారక్ ఫ్యాన్స్.
తారక్ సినీ కెరీర్‌లోనే రిస్కీ డిసీషన్
ఇక ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ ఊరమాస్ లుక్, ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ థీమ్ ఎలివేషన్లు నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. రక్తపాతంతో కూడిన ఒక కొత్త సామ్రాజ్యాన్ని శాసించే ‘డ్రాగన్’ అనే అత్యంత పవర్‌ఫుల్ రోల్‌లో తారక్ విశ్వ రూపం చూపించాడనే చెప్పాలి . “ఎన్టీఆర్ తన సినీ కెరీర్‌లోనే తీసుకున్న అత్యంత కఠినమైన, రిస్కీ డిసీషన్స్ లలో ఈ ప్రాజెక్ట్ ఒకటి” అని దర్శకుడు నీల్ స్వయంగా చెప్పడం ఈ సినిమాపై ఉన్న అంచనాల నెక్స్ట్ లెవెల్ లో పెట్టేసింది. గతంలో తారక్ నటించిన ‘సింహాద్రి’, ‘ఆంధ్రావాలా’, ‘టెంపర్’, ‘జనతా గ్యారేజ్’, ‘అరవింద సమేత’ వంటి బ్లాక్‌బస్టర్ మాస్ చిత్రాల్లోని క్యారెక్టర్ల కంటే ఈ ‘డ్రాగన్’ పాత్ర సరికొత్త పీక్స్‌లో ఉండబోతోందని తెలిసిపోతుంది
జూన్ 11న వరల్డ్ వైడ్ గా గ్రాండ్‌గా రిలీజ్
ఇక మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి అత్యంత భారీ బడ్జెట్‌తో ఇంటర్నేషనల్ స్టాండర్స్ లో ఈ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్న సంగతి తెల్సిందే.ఇక వచ్చే ఏడాది జూన్ 11న ఈ మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్‌ను వరల్డ్ వైడ్ గా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా .
కథ విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబో అంటేనే వైలెంట్ ఎంటర్‌టైన్‌మెంట్. దానికి తగ్గట్టే ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో నెక్ట్స్ లెవెల్ హైప్ క్రియేట్ చేశారు. 1960ల కాలంలో నడిచే ఇంటర్నేషనల్ ఓపియం (నల్లమందు) మాఫియా నేపథ్యంలో ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. అసలు భారత్‌ను బ్రిటిష్ వారు రూల్ చేయడానికి వెనుక ఉన్న సీక్రెట్ ఈ నల్లమందు బిజినేసేనని, ఆ తర్వాత ‘అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ’ లాంటి డ్రగ్ కార్టెల్స్ మధ్య జరిగిన గ్యాంగ్ వార్స్ చుట్టూ ఈ స్టోరీ రన్ అవుతుందని క్లియర్ కట్ హింట్ ఇచ్చేశారు.
‘లూగర్’ — ఒక కరడుగట్టిన అసాసిన్
ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు ‘లూగర్’ — ఒక కరడుగట్టిన అసాసిన్. ప్రశాంత్ నీల్ కెరీర్‌లోనే ఇదొక మైండ్ బ్లోయింగ్ డార్క్ రోల్. శత్రువులని వేటాడేటప్పుడు లూగర్‌కి అసలు దయాదాక్షిణ్యాలు ఉండవు. “ట్రిగ్గర్ నొక్కగానే మరిచిపోవడం దేవుడిచ్చిన వరం” అంటూ తారక్ చెప్పే వాయిస్‌ఓవర్ ఈ పాత్రలోని వైల్డ్‌నెస్‌ను చూపిస్తోంది.
ఈ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి భారత ప్రభుత్వం తరఫున నార్కోటిక్స్ బ్యూరో హెడ్ రఘువీర్ రాథోడ్ (అనిల్ కపూర్) ఎంటర్ అవుతాడు. పైకి ఇది పక్కా వైలెంట్ డ్రగ్ వార్‌లా కనిపిస్తున్నా, లోపల ఒక సాలిడ్ పేట్రియాటిక్ యాంగిల్ (దేశభక్తి కోణం) ఉన్నట్టు తెలుస్తుంది.చూడాలి ముందు ముందు ఈ డ్రాగన్ నుండి వచ్చే అప్ డేట్స్ ఇంకెన్ని సంచలనాలకి వేదిక అవుతాయో !








