AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మోదీ కేబినెట్ భేటీ..! మంత్రివర్గంలో మార్పులు-చేర్పులు, వారికి మాత్రమే చోటు..

ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్ గురువారం సాయంత్రం భేటీ కానుంది. ఈసారి మంత్రివర్గంలో మార్పులు-చేర్పులు జరగవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ మంత్రివర్గం సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఏడాది లేదా రెండేళ్లలో ఎన్నికల రానున్న రాష్ట్రాలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

 

మోదీ కేబినెట్ భేటీ.. మంత్రివర్గంలో మార్పులు-చేర్పులు

 

ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్ గురువారం సాయంత్రం సమావేశం కానుంది. మోడీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో వివిధ అంశాలను ప్రస్తావించనున్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు, ఆయిల్ ధరల పెంపు, రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇందులో ప్రస్తావించనున్నట్లు సమాచారం.

 

ఈ భేటీ గురించి ఇప్పటికే కేంద్రమంత్రులు, సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు అందరూ ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో వివిధ శాఖల పనితీరు, అవి తీసుకున్న కీలక నిర్ణయాలు, వాటి ఫలితాలతోపాటు రాబోయే రోజులకు సంబంధించిన ప్రాధాన్యతలు, దిద్దుబాటు చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

 

ఆయిల్ ధరలు పెంపు.. ఇరాన్ యుద్ధం ప్రభావంపై కూడా

 

ప్రభుత్వ పథకాలతోపాటు ఇతర విషయాలను కూడా సమీక్షించే అవకాశం ఉంది. దీనికితోడు కేంద్ర మంత్రులుగా ఉన్న కొంతమందికి పార్టీ బాధ్యతలు అప్పజెప్పడం, పనితీరు ఆధారంగా మరికొందరికి ఉద్వాసన పలకటం, కొత్తవారికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం లేకపోలేదు.

 

మార్పులు చేర్పులు అంశాన్ని కాసేపు పక్కనబెడితే పశ్చిమాసియాలో సంక్షోభం, దేశంపై పడుతున్న ఆర్థిక సమస్యలపై చర్చిస్తారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రజలకు అసౌకర్యం లేకుండా ఏ విధంగా ఎలా ముందుకు వెళ్లాలో దానిపై మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

 

అదనంగా ఇంధనం, వ్యవసాయం, ఎరువులు, విమానయానం, షిప్పింగ్-లాజిస్టిక్స్ వంటి రంగాలపై చర్చించే అవకాశం ఉందని ఓ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇప్పుడున్న పరిస్థితులకుఅనుకుంగా వివిధ రంగాలలో సంస్కరణలు తీసుకురావాలనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు పేర్కొంది. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీలో అక్కడ సాధించిన విజయాలను ఈ సందర్భంగా ప్రస్తావించే అవకాశముందని అంటున్నారు.

ANN TOP 10