AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘పెద్ది’లో రామ్ చరణ్ ఫేవరెట్ సీన్ అదే..! ట్విస్ట్‌ మాత్రం అదిరిపోద్దంటున్న బుచ్చిబాబు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కలయికలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi). షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియో ఇంటర్వ్యూలో రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అందులో ముఖ్యంగా సినిమాలో రాబోయే ‘ఢిల్లీ ఎపిసోడ్’, అలాగే అక్కడ రివీల్ అయ్యే ‘బిగ్గెస్ట్ ట్విస్ట్’ గురించి వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

 

చరణ్ మోస్ట్ ఫేవరెట్..

సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే, సెకండ్ హాఫ్‌లో వచ్చే ఢిల్లీ ఎపిసోడ్ మరో ఎత్తు అని చిత్ర యూనిట్ చెప్తోంది. ఈ ఎపిసోడ్ గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ, సినిమా మొత్తంలో తనకి అత్యంత ఇష్టమైన భాగం ఇదేనని స్పష్టం చేశారు. ఢిల్లీలో షూటింగ్ చేసే సమయంలో వాతావరణం అస్సలు సహకరించలేదని, తీవ్రమైన క్లైమేట్ ఇష్యూస్ ఉన్నప్పటికీ టీమ్ మొత్తం ప్రాణం పెట్టి పనిచేసిందని చరణ్ గుర్తుచేసుకున్నారు.

 

ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు విజువల్స్ మ్యాజిక్ గురించి చరణ్ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ ఎపిసోడ్ లో ఆయన చూపించిన వైడర్ రేంజ్ ఫ్రేమ్స్, కలర్ టోన్ సినిమా లుక్ అండ్ ఫీల్‌ని పూర్తిగా మార్చేస్తాయని, విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని చరణ్ కొనియాడారు. ఈ ఎపిసోడ్‌లోనే సినిమాలో ప్రధానాంశమైన ‘వ్యవసాయం’ బ్యాక్‌డ్రాప్, బలమైన ఎమోషన్స్ ట్రావెల్ అవుతాయని దర్శకుడు బుచ్చిబాబు లీక్ చేశారు.

 

హీరోయిజం 50 రెట్లు పెంచే ‘బిగ్గెస్ట్ ట్విస్ట్’

ఈ ఢిల్లీ ఎపిసోడ్‌లోనే సినిమాను మలుపు తిప్పే ఒక భారీ ట్విస్ట్ ఉంటుందని దర్శకుడు బుచ్చిబాబు సానా రివీల్ చేశారు. సాధారణంగా ఒక స్టార్ హీరో ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అలాంటి పాయింట్స్‌ను టచ్ చేయడానికి దర్శకులు వెనుకాడుతుంటారు. కానీ, బుచ్చిబాబు రాసిన కన్విక్షన్, కథలోని నిజాయితీ చరణ్‌కి బాగా నచ్చాయట. “సాధారణంగా అలాంటి సిట్యుయేషన్స్ వస్తే హీరోయిజం పడిపోతుందేమో అనిపిస్తుంది. కానీ ఈ కథలో ఆ పాయింట్ సెట్ అయిన విధానం వల్ల అక్కడే హీరోయిజం మరో 50 రెట్లు పెరిగి నెక్స్ట్ లెవెల్‌లో కూర్చుంటుంది” అని బుచ్చిబాబు ఎంతో నమ్మకంగా చెప్పారు.

 

ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రత్నవేలు విజువల్స్, రామ్ చరణ్ నటన.. అన్నీ కలిసి ఈ ట్విస్ట్ సీన్‌ను థియేటర్లలో ప్రేక్షకులకు రోమాంచితమైన అనుభూతిని ఇవ్వడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘ఉప్పెన’ లాంటి క్లాసిక్ డ్రామా తర్వాత బుచ్చిబాబు ఈ ‘పెద్ది’తో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారో చూడాలి!

 

ANN TOP 10