ఇండస్ట్రీలోని ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో మార్క్ ఉంటుందన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలతో ఆ డైరెక్టర్లు దొరికేక్కించే సినిమాలు తన మార్కుకి రీచ్ చేయాలా ఉంటాయి. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు కూడా ఒక మార్కు స్టైల్ ఉంటుంది. అదే అన్ని సినిమాలలో రిపీట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు రాబోతున్న సినిమాలో కూడా అదే మార్క్ ఉంటుందని అర్థమవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న డ్రాగన్ మూవీ నుంచి గ్లింప్స్ విడియోని రిలీజ్ చేశారు.. ఆ వీడియోలో నీల్ మావ మార్క్ మరోసారి బయటపడింది. అదేంటో ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్..
ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నీ కూడా యాక్షన్ జోనర్ లో వచ్చాయి. ఆ సినిమాలలో దాదాపు ఆయన హీరోలకి బ్లాక్ డ్రెస్ లే ఎక్కువగా వాడతారు. కెమెరా ఫ్రేమ్స్ కూడా బ్లాక్ గా, డల్ గా కనిపిస్తాయి. తన మొదటి సినిమా ఉగ్రం నుంచి అంతే. కన్నడ స్టార్ హీరో యష్ తో కేజీఎఫ్ సిరీస్ సినిమాలు కూడా చేశారు. అవి కూడా అలానే బ్లాక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చాయి.. అయితే ఈ సినిమాలు బాగా హిట్ అయ్యాయి. ఇప్పుడు రాబోతున్న ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో కూడా దాదాపు అదే స్కీమ్స్ కనిపిస్తున్నట్లు ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోలో అదే కనిపిస్తుంది. ఎన్టీఆర్ ని హైలెట్ చేసే సీన్ లో అసలు ఎన్టీఆర్ క్లియర్ గా కనపడడు.. ఎన్నో ఎలివేషన్ సీన్స్ ని తెరకెక్కించడం డైరెక్టర్ గొప్పతనం. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం అయితే ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. కానీ ఎన్టీఆర్ కాస్త కలర్ఫుల్ గా కనిపిస్తే బాగుండు అని కొందరు ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై ప్రశాంత్ నీల్ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
డ్రాగన్ షూటింగ్ అప్డేట్..
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. గతంలో వచ్చిన దేవర సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్న ఎన్టీఆర్ ను ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూస్తామా అని అభిమానులు వెయ్యి కళ్ల తో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ దాదాపు 80% వరకు షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది.. త్వరలోనే మిగిలిన పార్ట్ ని పూర్తి చేసి ప్రమోషన్స్ కార్యక్రమాలని మొదలుపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది గ్లింప్స్ వీడియో.. మరి సినిమా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి…








