AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘NBK111’ నుంచి క్రేజీ అప్డేట్..! బాలయ్యకు విలన్‌గా మంచు మనోజ్..

తెలుగు సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పుతున్న చిత్రాల్లో ‘NBK111’ ఒకటి. నందమూరి బాలయ్య బాబు హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తాజాగా మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో నటుడు మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆయన పాత్ర విలన్‌గా ఉండొచ్చన్న ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

 

ఈ అప్‌డేట్‌ను షేర్ చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని.. సినిమాలో మనోజ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని వెల్లడించారు. దీంతో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. గతంలో ‘ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?’ చిత్రంలో కలిసి నటించిన బాలకృష్ణ, మంచు మనోజ్.. ఇప్పుడు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుండటం విశేషంగా మారింది.

 

ఇక ఈ సినిమా చారిత్రాత్మక కథాంశంతో రూపొందుతున్నట్లు సమాచారం. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనుండటం మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న రెండో చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

 

అలాగే ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తోంది. గతంలో బాలకృష్ణ, నయనతార కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ చిత్రాలు మంచి విజయాలను అందుకోవడంతో, వీరిద్దరి కాంబోలో వస్తున్న నాల్గవ చిత్రంగా ‘NBK111’పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ సినిమాకు థమన్ సంగీతం అందించడం ఇది ఆరోసారి కావడంతో, మాస్ ఆడియన్స్‌తో పాటు సినీ అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ హైప్ ఏర్పడింది.

ANN TOP 10