AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. !

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్‌కు తెరపడింది. కాంగ్రెస్, వామపక్షాలతో పాటు వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు పలకడంతో విజయ్ ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమమైంది. రేపు ఉదయం 10 గంటలకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు రాజకీయాలు ఆరు రోజుల పాటు తీవ్ర ఉత్కంఠను రేపాయి. విజయ్‌కి మార్గం సుగమం కావడంతో ఆయన తండ్రి, దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ స్పందించారు.

 

విజయ్ ముఖ్యమంత్రి కావడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. “నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఏం చేసినా నా కుమారుడి కోసమే చేస్తున్నాను. చివరకు, విజయ్ ద్వారా తమిళ ప్రజలు విజయం సాధించారు” అని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన కుమారుడికి కూడా ఒక సందేశం ఇచ్చారు. “ప్రతిదీ తమిళుల కోసమే చేయి” అని కాబోయే ముఖ్యమంత్రికి సూచించారు.

ANN TOP 10