టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చలామణి అవుతున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ (Prashanth neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు . ఇక మొన్నటికి మొన్న ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీతో.. కండలు తిరిగిన దేహంతో కనిపించిన ఫోటో అంచనాలు పెంచేసింది.ఈ లుక్ అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఈ లుక్ చూసిన తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమా కోసం భారీగా తగ్గిపోయారు అనే కామెంట్లు కూడా వినిపించాయి. అయితే ఈ ఫోటో వెనుక అసలు విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ లుక్ తో ఫ్యాన్స్ కి ప్రశాంత్ నీళ్ స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని తెగ కామెంట్లు చేస్తున్నారు..మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రశాంత్ మూవీ కోసం ఎన్టీఆర్ భారీ మేకోవర్..
ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత దేవరా సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాపై అభిమానులలోనే కాదు సినిమా ప్రేక్షకుడిలో కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా మొదటి భాగం వచ్చే ఏడాది జూన్లో విడుదల కానుండగా.. ఇటు రెండవ భాగం కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ రెండవ భాగంలో ఎన్టీఆర్ ఫిజిక్ పట్ల వస్తున్న అప్డేట్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఈ మేరకు ఎన్టీఆర్ కి సంబంధించిన సిక్స్ ప్యాక్ బాడీ ఫోటో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ సినిమాలో మామూలుగా ఉండదని అందరూ అనుకుంటున్నారు.
మొదటి భాగంలో అలా.. రెండవ భాగంలో ఇలా..
ఇలాంటి సమయంలో అభిమానులకు ప్రశాంత్ నీళ్ మరో స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా బక్క చిక్కిపోయి సిక్స్ ప్యాక్ బాడీ తో పార్ట్ వన్ లో కనిపిస్తే.. బరువు పెరిగి బల్క్ బాడీతో ఫిట్ గా రెండవ భాగంలో కనిపించనున్నారట. అలా ఈ సినిమాని రెండు భాగాలుగా ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నారట. పార్ట్ 1 తో పాటు సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ చేయడానికి ప్రశాంత్ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఇక కథ పరంగా చూసుకుంటే రెండవ భాగంలో హీరో పాత్ర మరింత బలంగా శక్తివంతంగా ఉంటుందని, అందులో హీరో చాలా భారీగా కనిపించాల్సి ఉంటుందని, ఎన్టీఆర్ కూడా తన బాడీని భారీగా బల్క్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే ఒక భాగంలో బక్కగా.. మరొక భాగంలో బరువు పెరిగిపోయి ఫిట్ గా కనిపించడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇక ఈ లుక్ రెండో భాగానికి లీడ్ ఇచ్చేలా ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రశాంత్ నీళ్ టాలెంట్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు నీ బుర్రె బుర్ర మావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారని మాత్రం చెప్పవచ్చు








