జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు అధికారికంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విలీనమయ్యారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ ఈ విలీనాన్ని ఆమోదించినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
బీజేపీలో చేరిన ఏడుగురు ఎంపీలు ఎంతో క్రమశిక్షణ కలిగిన వారని, పార్లమెంటరీ నిబంధనలకు లోబడి పనిచేసే వారంటూ కిరణ్ రిజిజు కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానించిన మంత్రి, ఇదే సమయంలో విపక్షాల ‘ఇండి’ కూటమిపై విరుచుకుపడ్డారు. తుక్డే-తుక్డే ఇండి అలయన్స్‌కు గుడ్ బై చెప్పే సమయం వచ్చింది అంటూ రిజిజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.








