జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు తదితరులపై తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది.
హైకోర్టు తీర్పులోని లోపాలను ఎత్తిచూపుతూ, ప్రాజెక్టులో జరిగిన అసలు అవకతవకలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే న్యాయ విభాగంతో చర్చలు పూర్తి చేసి, పిటిషన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
విచారణలో నిబంధనలు పాటించలేదని, ముందస్తు నోటీసులు ఇవ్వలేదని అభిప్రాయపడుతూ హైకోర్టు.. కేసీఆర్, హరీశ్ రావు, స్మితా సబర్వాల్ వంటి వారికి ఊరటనిచ్చింది. అయితే, ప్రాజెక్టు వైఫల్యాలపై పూర్తి స్థాయి విచారణ జరగాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. సుప్రీంకోర్టులో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.








