పుష్ప-2 తో 1800 కోట్లు కొల్లగొట్టి చాలా మంది హీరోలకి అందనంత దూరం వెళ్ళిపోయాడు బన్నీ. ఇక దీని తర్వాత ఎవరితో సినిమా చేస్తాడంటూ క్యూరియస్ గా వెయిట్ చేసిన ఇండస్ట్రీకి పెద్ద షాకే ఇస్తూ తమిళ తంబి అట్లీతో AA22XA6 అంటూ జత కట్టాడు.ఇక మరికొద్ది గంటల్లో అంటే ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు.ఇక ఈరోజు గిఫ్ట్ గా అల్లు అట్లీ సినిమా టైటిల్ రివీల్ కాబోతుందన్న వార్త తెగ సర్క్యులేట్ అవుతుంది.అయితే టీమ్ మెయింటైన్ చేస్తున్న సీక్రెసీ ఇప్పుడు నెగెటివ్ టాక్‌కు కారణమవుతోంది. అసలు సినిమా టైటిల్ ఏంటనేది అటు హీరోకి, ఇటు డైరెక్టర్‌కు తప్ప సెట్స్‌లో పని చేసే మిగతా చీఫ్ టెక్నీషియన్స్ కి కూడా తెలియకపోవడం ఏంటని షాక్ అవుతున్నాయ్ ట్రేడ్ సర్కిల్స్. సాధారణంగా పెద్ద సినిమాల లీకులు సహజం, కానీ ఏ చిన్న ఫుటేజీ కూడా బయటకు రాకుండా అట్లీ తీసుకుంటున్న కేర్ చూస్తుంటే,అట్లీ గారు కథ మీద కంటే కవర్ అప్ మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారా ఏంటి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయ్.
వైల్డ్ ఫైర్, లెగసీ, అయాన్, స్పార్క్..
ఇక సోషల్ మీడియాలో అయితే టైటిల్స్ విషయంలో పెద్ద యుద్ధమే జరుగుతోంది.అబ్బే మేము అనౌన్స్ చేసేదాకా ఆగలేమంటూ ‘వైల్డ్ ఫైర్, లెగసీ, అయాన్, స్పార్క్..’ ఇలా నోటికొచ్చిన పేర్లన్నీ పెట్టేసుకున్నారు ఫ్యాన్స్. నిజానికి వీటిలో ఏ పేరు ఫైనల్ చేసినా అది పాత సినిమాల వాసన కొడుతుందనేది వాస్తవం.అన్నింటికన్నా ముఖ్యంగా పునర్జన్మల నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ కథను ఎంచుకోవడం వెనుక అట్లీ మాస్టర్ ప్లాన్ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.
అట్లీ మార్క్ ‘ఖిచిడీ’ అవుతుందా?
గతంలో అట్లీ తీసిన సినిమాలు చాలావరకు పాత హిట్ సినిమాలని మిక్సిలో వేసి తీసినట్టు ఉంటాయన్న ఆరోపణలు ఉన్నాయి కూడా.మరి ఇప్పుడు బన్నీతో చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ఏకంగా మూడు డిఫరెంట్ రోల్స్, మూడు వేర్వేరు టైం లైన్ లలో ఉంటాయన్న వార్త బన్నీ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నా,ఇది అట్లీ మార్క్ ‘ఖిచిడీ’ అవుతుందా ఎంటి అని బయపడి పోతున్నాడు సగటు సినీ ప్రేక్షకుడు.
పాన్ ఇండియా మార్కెట్ కోసం చేస్తున్న గారడీ?
ఇక ఇదిలా ఉంటె హీరోయిన్ల సెలక్షన్ లో జరుగుతున్న రచ్చ మాములుగా లేదు.ఇప్పటికే దీపికా పదుకొణె పేరును మాత్రమే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే ఇందులో . జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, కూడా నటిస్తున్నారని, ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్నా విలన్ రోల్ లో కనిపించబోతుందని,బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఓ కీ రోల్ లో కనిపిస్తుందని .. ఇలా ఇబ్బడి ముబ్బడిగా న్యూస్ సర్క్యులేట్ అవుతున్నా మేకర్స్ ఎక్కడా క్లారిటీ ఇవ్వని పరిస్థితి.అయితే ఇంత మంది స్టార్ హీరోయిన్లని అట్లీ ఆన్ బోర్డ్ చేస్తున్నాడంటే అసలు స్టోరీ డిమాండ్ చేస్తుందా లేక పాన్ ఇండియా మార్కెట్ కోసం చేస్తున్న గారడీనా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయ్.
మొత్తానికి, రేపు రాబోయే టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈ డౌట్స్ అన్నింటికీ ఆన్సర్ ఇస్తుందా లేక హైప్‌ను మరింత పెంచి తీరా రివీల్ చేశాక తుస్సుమనిపిస్తుందా చూడాలి !








